
గోదావరిఖని, 30 అక్టోబర్ (హి.స.)
వైద్య వృత్తిని ఎంచుకున్న విద్యార్థులు ఎటువంటి విపత్కర పరిస్థితిలోనైనా ధైర్యంగా ఉండాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం రామగుండంలోని సింగరేణి వైద్య కళాశాలలో నిర్వహించిన వైట్ కోట్ సేర్మనీలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. వైద్య కోర్సును ఎంపిక చేసుకుని మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలో రామగుండం సింగరేణి వైద్య కళాశాల వద్ద మెరుగైన వసతులు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సింగరేణి వైద్య కళాశాలలో కమిట్మెంట్ తో పని చేసే ఫ్యాకల్టీ అందుబాటులో ఉందని ఇక్కడ విద్యార్థులకు మంచి టీచింగ్ అందుతుందని అన్నారు. వైద్యులుగా ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా నిర్దేశించుకున్న లక్ష్యాలను వైట్ కోట్ సెర్మనీ గుర్తు చేస్తుందని కలెక్టర్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు