రైల్వే శాఖ శుభవార్త..ఇక మరింత వేగంగా సికింద్రాబాద్-విజయవాడ ప్రయాణం !
హైదరాబాద్, 30 అక్టోబర్ (హి.స.) రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్. విజయవాడ నుంచి సికింద్రాబాద్ మధ్య ప్రయాణించే రైళ్ల వేగాన్ని పెంచేందుకు రైల్వే శాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మార్గంలో విద్యుత్ ట్రాక్షన్ వ్యవస
రైల్వే శాఖ


హైదరాబాద్, 30 అక్టోబర్ (హి.స.)

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు

అలర్ట్. విజయవాడ నుంచి సికింద్రాబాద్ మధ్య ప్రయాణించే రైళ్ల వేగాన్ని పెంచేందుకు రైల్వే శాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మార్గంలో విద్యుత్ ట్రాక్షన్ వ్యవస్థ పనులకు శ్రీకారం చుట్టింది. వేగంగా రూ.188 కోట్లతో ఈ పనులు పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేసింది రైల్వే శాఖ. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి మూడు సంవత్సరాల సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.

విజయవాడ - సికింద్రాబాద్ మార్గంలో విద్యుత్ ట్రాక్షన్ పనులు తొందరగా పూర్తయితే రైళ్ల వేగం భారీగా పెరిగే అవకాశాలు ఉంటాయి. దానివల్ల గమ్యస్థానాలకు త్వరగానే చేరిపోవచ్చు. సరుకు రవాణా రైళ్ల రాకపోకలు కూడా మెరుగు పడతాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఏపీ అలాగే తెలంగాణ మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గే ఛాన్స్ ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande