
హైదరాబాద్, 30 అక్టోబర్ (హి.స.)
తుఫాన్ ప్రభావంతో దుండుభి, చంద్రవాగు వంటివాగులు ఉధృతంగా ప్రవహించడంతో హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారి దెబ్బతింది. రహదారి ఒకభాగం వరద ఉధృతికి తెగిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాహనదారుల భద్రత దృష్ట్యా పోలీసులు, రవాణా శాఖ అధికారులు కొండారెడ్డిపల్లి మార్గం ద్వారా వాహనాలను మళ్లించారు. శ్రీశైలం వెళ్లే ప్రయాణికులు కొండారెడ్డిపల్లి చింతపల్లి బ్రిడ్జి తిప్పాపూర్ హాజీపూర్ మీదుగా వెళ్లేందుకు ఏర్పాటు చేశారు. హైదరాబాదు నుండి అచ్చంపేటకు చేరుకునే ప్రయాణికులు కొండారెడ్డిపల్లి చింతపల్లి కాంసానిపల్లి ఉప్పునుంతల మీదుగా రాకపోకలను పునరుద్ధరించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు