సోషల్ మీడియాలో నన్ను టార్గెట్ చేస్తున్నారు : కోమటిరెడ్డి రాజగోపాల్
యాదాద్రి భువనగిరి, 30 అక్టోబర్ (హి.స.) సోషల్ మీడియాలో తనను కావాలని టార్గెట్ చేస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. తాను అనని వ్యాఖ్యలు కూడా అంటగట్టి ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసార
ఎమ్మెల్యే కోమటిరెడ్డి


యాదాద్రి భువనగిరి, 30 అక్టోబర్ (హి.స.) సోషల్ మీడియాలో తనను కావాలని టార్గెట్ చేస్తున్నారని

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. తాను అనని వ్యాఖ్యలు కూడా అంటగట్టి ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పర్యటనలో గురువారం వారు మాట్లాడుతూ..తాను ఏదైనా రాజకీయ పరంగా నిర్ణయం తీసుకుంటే ప్రెస్మీట్ పెట్టి నేనే చెప్తానని స్పష్టం చేసారు. మంత్రివర్గ విస్తరణ అనేది హైకమాండ్ తీసుకునే నిర్ణయమని, పార్టీకి ఏది మంచిదో ఆ నిర్ణయమే అధిష్టానం తీసుకుంటుందని పేర్కొన్నారు. దీనిని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో తనమీద ట్రోలింగ్ కు దిగారని ఫైర్ అయ్యారు. ఒక ఎమ్మెల్యేగా, క్రమశిక్షణ గల కార్యకర్తగా మునుగోడు అభివృద్ధి కోసం కృషి చేస్తానని, మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande