
తొర్రూర్, 30 అక్టోబర్ (హి.స.)
మొంథా తుపాన్ ప్రభావంతో
మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల భద్రతపై పాలకుర్తి ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి పర్యటించారు. పాలకుర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రోడ్లు దెబ్బతినడం, చెరువులు పొంగి రోడ్లపైకి నీరు రావడం వంటి సమస్యలు తలెత్తడంతో అధికారులను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా తొర్రూర్ మండల పరిధిలోని అమ్మాపురం, గుర్తూరు రహదారి వద్ద వర్షపు నీరు రోడ్డు మీదుగా ప్రవహిస్తుండగా ఎమ్మెల్యే అక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులతో సమీక్ష జరిపి, నీరు తగ్గే వరకు ఆ మార్గంలో వాహన రాకపోకలు నిలిపి వేయాలని సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు