
వరంగల్, 30 అక్టోబర్ (హి.స.)
మొంథా తుపాను ధాటికి గ్రేటర్
కాగా వరంగల్ నగరం అతలాకుతలం అయింది. భారీ వర్షాల కారణంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని పలు డివిజన్లలో కాలనీలు ముంపు కాలనీలలో మంత్రి కొండా సురేఖ పర్యటిస్తున్నారు. నగరంలో ఏ వైపు చూసిన వరద నీళ్లే కనిపిస్తున్నాయి. వర్షం ధాటికి 45 పైగా కాలనీలు ముంపుకు గురయ్యాయి. కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. విద్యుత్ నిలిపివేయడంతో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. పలు కాలనీ వాసులు ఇళ్లపైకి ఎక్కి బిక్కు బిక్కు మంటున్నారు. ఈ వర్షానికి వరంగల్, హనుమకొండ, కాజీపేట పూర్తిగా జలమయమయ్యాయి. నగరంలో అతి భారీ వర్షం పడటంతో కాలనీలలో వరద ముంచెత్తింది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు