
సిద్దిపేట, 30 అక్టోబర్ (హి.స.)
వర్షాల కారణంగా తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో భారీగా పంటనష్టం కలిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. గురువారం ఆయన సిద్దిపేట జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జాతీయ విపత్తుగా పరిగణించి కేంద్రం తక్షణమే సాయం అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక రూపొందిస్తున్నామని తెలిపారు. తప్పకుండా పంటనష్టపోయిన రైతులు అందరినీ ఆదుకుంటాం, ఆర్థిక సాయం చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు. కరీంనగర్, సిద్దిపేట, హన్మకొండ జిల్లాల పరిధిలో ఉన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు. వేలాది ఎకరాల్లో ధాన్యం కొట్టుకుపోయిందని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు