
హైదరాబాద్, 30 అక్టోబర్ (హి.స.) హైదరాబాద్ నగరంలోని ఘోస్నగర్ ప్రాంతంలో నిన్న అర్ధరాత్రి జరిగిన హత్య సంఘటన స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. పాన్షాప్ యజమాని మొహ్సిన్(35) పై గుర్తు తెలియని నలుగురు దుండగులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. సమాచారం అందుకున్న వెంటనే బండ్లగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రాంతాన్ని ముట్టడించారు. క్లూస్ టీమ్ ఆధ్వర్యంలో ఆధారాల సేకరణ కొనసాగుతోంది. మొహ్సిన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు