
రాజన్న సిరిసిల్ల, 30 అక్టోబర్ (హి.స.)
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు టార్పాలిన్లు తప్పనిసరిగా అందజేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంఛార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశించారు. గురువారం తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో ప్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పలు, వడ్ల తేమ శాతం పరిశీలించి, రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాల నేపథ్యంలో రైతులు వరి కోతలు మరో రెండు రోజులు వాయిదా వేసుకోవాలని కోరారు. వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత ధాన్యం ఆరబెట్టాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని రైస్ మిల్లర్లు అన్ లోడ్ చేసుకునేలా చూడాలని, సన్నరకం వడ్లను కూడా తీసుకునేలా అన్ని చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారిని ఆదేశించారు. రైతులు ఆందోళన చెందవద్దని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు