ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని చెరువులపై హైడ్రా ఫోకస్
హైదరాబాద్, 30 అక్టోబర్ (హి.స.) చెరువుల ఆక్రమణలు,కబ్జాలపై ఫోకస్ పెట్టి వాటిని తొలగించడమే కాకుండా.. పునరుద్ధరించే బాధ్యతలను సైతం హైడ్రా తీసుకున్నది. చెరువుల గుర్తింపు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించడానికి ప్రిలిమినరీ, ఫైనల్ నోటిఫికేషన్లు జారీ చేయడ
హైడ్రా


హైదరాబాద్, 30 అక్టోబర్ (హి.స.)

చెరువుల ఆక్రమణలు,కబ్జాలపై ఫోకస్ పెట్టి వాటిని తొలగించడమే కాకుండా.. పునరుద్ధరించే బాధ్యతలను సైతం హైడ్రా తీసుకున్నది. చెరువుల గుర్తింపు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించడానికి ప్రిలిమినరీ, ఫైనల్ నోటిఫికేషన్లు జారీ చేయడానికి సైతం కసరత్తు చేస్తున్నది. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని చెరువులపై ఫోకస్ పెట్టింది. అందుకే బతుకమ్మకుంటనే సజీవ సాక్ష్యం. రూ.58.50 కోట్లతో ఆరు చెరువులను పునరుద్ధరించాలని నిర్ణయించిన హైడ్రా.. ఒక్కొక్కటిగా చెరువులను పునరుద్ధరిస్తుంది. ఇప్పటికే బతుకమ్మకుంట ను ప్రారంభించింది.

ప్రస్తుతం బుమృకుద్దాలా, తర్వాత కూకట్ పల్లి నల్లచెరువు, మాదాపూర్ లోని తుమ్మిడి కుంట చెరువులను పునరుద్ధరించాలని హైడ్రా నిర్ణయించింది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande