మొంథా బీభత్సం.. నీట మునిగిన పంట పొలాలు
కరీంనగర్, 30 అక్టోబర్ (హి.స.) కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం లో తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. బుధవారం ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి రోడ్డు పై కుప్ప పోసిన ధాన్యం వరదలో కొట్టుకు పోయింది. కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసి ముద్ద
తుఫాన్


కరీంనగర్, 30 అక్టోబర్ (హి.స.)

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం

లో తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. బుధవారం ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి రోడ్డు పై కుప్ప పోసిన ధాన్యం వరదలో కొట్టుకు పోయింది. కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చేతికొచ్చిన పంట చేనులు నీట మునిగాయి. భారీ వర్షం కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లడంతో లో లెవెల్ వంతెనల వద్ద పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో మండల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పంట పోలాలు మొంథా తుఫాన్ కారణంగా చెరువులను పాఠశాల తలపిస్తున్నాయి. సోమారం ఆదర్శ జలమయంగా మారింది. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande