పెద్దపల్లి, ఖమ్మం జిల్లాలలో రోడ్డు ప్రమాదాలు ముగ్గురు మృతి
తెలంగాణ, 30 అక్టోబర్ (హి.స.) రాష్ట్రంలో గురువారం జరిగిన రెండు వేరువేరు రోడ్డు ప్రమాదాలలో ముగ్గురు మరణించారు. ఖమ్మం కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఈ రోజు తెల్లవారు జామున ఆగిఉన్న బస్సును వెనుక నుంచి లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఒకరికి గాయా
రోడ్డు ప్రమాదాలు


తెలంగాణ, 30 అక్టోబర్ (హి.స.) రాష్ట్రంలో గురువారం జరిగిన రెండు వేరువేరు రోడ్డు ప్రమాదాలలో ముగ్గురు మరణించారు.

ఖమ్మం కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఈ రోజు తెల్లవారు జామున ఆగిఉన్న బస్సును వెనుక నుంచి లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఒకరికి గాయాలయ్యాయి. ఆగిఉన్న బస్సు నుంచి ప్రయాణికులు లగేజీ తీసుకొనే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీట్రక్ అతి వేగం గా వచ్చి ఢీకొట్టింది.

మరో సంఘటనలో పెద్దపల్లి బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆర్టీసీ బస్సు

ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. కరీంనగర్ నుండి గోదావరిఖని వెళ్లే ఆర్టీసీ బస్సు నడుచుకుంటూ వెళ్తున్న పెద్దపల్లి పట్టణం శాంతి నగర్ కు చెందిన పెంజర్ల లక్ష్మీ నారాయణను ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande