
నెల్లూరు, 30 అక్టోబర్ (హి.స.)
,:జిల్లాలోని సంగం బ్యారేజ్‌కు ( పెను ముప్పు తప్పింది. వరదలకు కొట్టుకొచ్చిన భారీ బోటును జిల్లా యంత్రాంగం ఎంతో చాకచక్యంగా ఒడ్డుకు చేర్చడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. నెల్లూరు జిల్లాలో మొంథా తుపాను తీవ్ర ప్రభావాన్ని చూపింది. రికార్డు స్థాయిలో వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. అలాగే సంగం బ్యారేజ్‌కు లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాలు చేరాయి. వరదలకు సంగం బ్యారేజ్‌కు 30 టన్నుల భారీ బోటు కొట్టుకొచ్చింది. లక్ష క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్న వేళ కొట్టుకొచ్చిన బోటు ప్రాజెక్టుకు తగిలితే బ్యారేజ్‌కు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం బోటుతో బ్యారేజ్‌కు నష్టం జరుగకుండా సమిష్టి కృషితో వేగవంతంగా చర్యలు తీసుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ