తుఫాన్ ప్రభావం : తడిసిన ధాన్యాన్ని గుర్తించండి.. సిద్దిపేట కలెక్టర్ ఆదేశాలు
సిద్దిపేట, 30 అక్టోబర్ (హి.స.) తుఫాన్ ప్రభావంతో జిల్లాలో జరిగిన నష్టాన్ని ప్రభుత్వానికి నివేదిక అందజేస్తానని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కే హైమావతి అన్నారు. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను గురువారం జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా వరద
సిద్దిపేట కలెక్టర్


సిద్దిపేట, 30 అక్టోబర్ (హి.స.) తుఫాన్ ప్రభావంతో జిల్లాలో జరిగిన నష్టాన్ని ప్రభుత్వానికి నివేదిక అందజేస్తానని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కే హైమావతి అన్నారు. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను గురువారం జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా వరద ప్రవాహానికి మార్కెట్ యార్డ్ లో ధాన్యం కొట్టుకుపోయిన రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ నుంచి వరద నీరు బయటకు వెళ్లే మార్గం నుంచి వదర నీరు మార్కెట్ యార్డ్ లోకి రావడంతో నష్టం వాటిల్లినట్లు తెలిపారు.

ఈ ఘటనలో సుమారు 1500 క్వింటాళ్ల వరి ధాన్యం కొట్టుక పోయినట్లు ప్రాథమిక సమాచారం అన్నారు. మార్కెటింగ్ అధికారులు తడిసిన, కొట్టుకుపోయిన, మొలకెత్తిన ధాన్యం వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. వరి ధాన్యం ఆరబెట్టిన తర్వాతనే మార్కెట్ కు తీసుకురావాలని రైతులకు కలెక్టర్ సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande