
అనంతపురం, 30 అక్టోబర్ (హి.స.)
:కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్‌పై ప్రభుత్వం వేటు వేసింది. మున్సిపల్ చైర్మన్ పదవి నుంచి వైసీపీ నేత తలారీ రాజ్ కుమార్‌ను తొలగించింది. అధికార దుర్వినియోగం చేసినందుకు వేటు వేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కౌన్సిల్ సమావేశాలు నిర్వహించడంలో తీవ్రనిర్లక్ష్యం వహించినందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. గతంలో షోకాజ్ నోటీసులు పంపినా రాజ్ కుమార్ స్పందించక పోవడంతో.. ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం 1965 ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ