ముంపు ప్రాంతాలను పరిశీలించిన వరంగల్ పోలీస్ కమిషనర్.. బాధితులకు భరోసా..
వరంగల్, 30 అక్టోబర్ (హి.స.) ముంపు ప్రాంతాల ప్రజలకు ఓరుగల్లు పోలీసులు భరోసా కల్పిస్తున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ గురువారం లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. పోలీసుల పరంగా అన్నిరకాల సహాయ, సహకారాలు అందిస్తామంటూ భరోసా కల్పించారు. ఎటు
వరంగల్ సిపి


వరంగల్, 30 అక్టోబర్ (హి.స.)

ముంపు ప్రాంతాల ప్రజలకు ఓరుగల్లు పోలీసులు భరోసా కల్పిస్తున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ గురువారం లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. పోలీసుల పరంగా అన్నిరకాల సహాయ, సహకారాలు అందిస్తామంటూ భరోసా కల్పించారు. ఎటువంటి ఇబ్బందులు, కష్టాలు తలెత్తిన పోలీసులకు సమాచార మివ్వాలని కోరారు. తక్షణమే వరంగల్ పోలీసులు స్పందించి తగిన సహాయమందిస్తారంటూ భరోసా నిచ్చారు. మేమున్నాం.... అధైర్య పడొద్దు..... ధైర్యం ' గా ఉండాలంటూ ప్రజల్లో ధైర్యాన్ని నింపారు.ఇళ్లలోకి వరద నీరు వస్తే తక్షణమే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలిస్తామని పోలీస్ కమిషనర్ అభయ మిచ్చారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande