అష్టలక్ష్మి ఆలయంలో శృంగేరి పీఠాధిపతి పూజలు
హైదరాబాద్, 30 అక్టోబర్ (హి.స.) శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధుశేఖర మొదటి భారతీ మహాస్వామి విజయ యాత్రలో భాగంగా ఆర్కే పురం డివిజన్ వాసవికాలనీ కొత్తపేటలో కొలువై ఉన్న అష్టలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామి సాన్నిద్యం అష్టలక్ష్మి దేవాలయానికి విచ్చే
శృంగేరి పీఠాధిపతి


హైదరాబాద్, 30 అక్టోబర్ (హి.స.)

శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధుశేఖర

మొదటి భారతీ మహాస్వామి విజయ యాత్రలో భాగంగా ఆర్కే పురం డివిజన్ వాసవికాలనీ కొత్తపేటలో కొలువై ఉన్న అష్టలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామి సాన్నిద్యం అష్టలక్ష్మి దేవాలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నప్రసాద శాల అంతస్తులో అమ్మవార్ల దర్శనానికి వచ్చిన భక్తులందరినీ అనుగ్రహింప చేశారు. స్వామి వారి అనుగ్రహ భాషణ కళ్యాణ మండపం ప్రాంగణములో జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు కుటుంబ సమేతంగా పాల్గొని పూజలు చేసారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande