
అమరావతి, 30 అక్టోబర్ (హి.స.)మొంథా తుపాన్.. ఒక్కసారిగా రైతన్నను నిండా ముంచింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మంథని మండలం లోని రైతుల పంట పొలాలు కోలుకోలేని విధంగా తీవ్ర నష్టం కలిగించింది. ఈదురు గాలులు వర్షంతో పత్తి, వరి పంట పొలాలు నేలకొరిగాయి. పత్తి చేను తడిసి ముద్దయ్యాయి. వరి పంట నెల రాలడంతో ధాన్యం మొత్తం నీట మునిగాయి. అదే విధంగా మంథని పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ తో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లోకి వరద నీరు వచ్చి చేరడంతో మార్కెట్ లో రైతులు అరబోసిన ధాన్యం కుప్పల్లోకి నీరు వచ్చి చేరింది. ధాన్యం కుప్పలు తడవడంతో ధాన్యం ముద్దగా మారింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందో లేదోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన వరి, పత్తి పంట పొలాలకు ప్రభుత్వం నష్టం పరిహారం చెల్లించాలని రైతులు ప్రభుత్వన్ని వేడుకుంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV