
అమరావతి, 31 అక్టోబర్ (హి.స.)ప్రమాదంలో మృతి చెందిన 19మంది కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.2లక్షల చొప్పున, గాయపడిన నలుగురికి రూ.50వేల చొప్పున వి.కావేరి ట్రావెల్స్ యాజమాన్యం ఆర్థిక సాయం అందజేసింది. ఈ మేరకు రూ. 40 లక్షల చెక్‌ను ఆ సంస్థ ప్రతినిధులు జిల్లా కలెక్టరేట్‌లో గురువారం మంత్రి టీజీ భరత్‌కు అందజేశారు. కాగా, ప్రమాదంలో మృతి చెందిన ఏపీ వాసులైన ఏడుగురు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబీకులు, గాయపడిన నలుగురి బ్యాంక్ ఖాతాలు తీసుకొని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించామని, ఒకటి రెండు రోజుల్లో వారి ఖాతాల్లో ఆర్థిక సాయం జమ అవుతుందని జిల్లా కలెక్టర్ ఏ.సిరి ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ