రాష్ట్రంలో.గతం.లో.ఎన్నడూ లేని విధంగా 51 లక్షల టన్నుల. ధాన్యం కొనుగోలు
తెనాలి, 31 అక్టోబర్ (హి.స.), :‘రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 51 లక్షల టన్నులు ధాన్యం కొనుగోలు చెయ్యాలని నిర్ణయించుకున్నాం’ అని మంత్రి నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. తుఫాన్‌ కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులను పరామర్శించిన అనంతరం గురువారం గుంటూరు
రాష్ట్రంలో.గతం.లో.ఎన్నడూ లేని విధంగా 51 లక్షల టన్నుల. ధాన్యం కొనుగోలు


తెనాలి, 31 అక్టోబర్ (హి.స.), :‘రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 51 లక్షల టన్నులు ధాన్యం కొనుగోలు చెయ్యాలని నిర్ణయించుకున్నాం’ అని మంత్రి నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. తుఫాన్‌ కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులను పరామర్శించిన అనంతరం గురువారం గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ధాన్యం క్వింటాల్‌కు రూ.2,369 చొప్పున మద్దతు ధర ఇస్తాం. రైతు నుంచి కొనుగోలు చేసిన 48 గంటల్లోనే కచ్చితంగా డబ్బు వారి ఖాతాలో జమ చేసేలా మార్పులు చేశాం. ఈ క్రాప్‌ నమోదు చేసుకున్న ప్రతి కౌలు రైతుకు నష్టపరిహారం కచ్చితంగా అందుతుంది. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రత్యేక అవసరాల వారికి నిత్యావసరాలు ఇవ్వాలని దివ్యాంగులు విజ్ఞప్తి చేశారు. విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళతాను’ అని మంత్రి మనోహర్‌ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande