
హైదరాబాద్, 31 అక్టోబర్ (హి.స.)
హకీంపేట టోలీచౌకి ప్రాంతానికి చెందిన మహమ్మద్ ముజామిల్ అలియాస్ ఆయుబ్ (24) ఆటో డ్రైవర్ గురువారం హత్య గావించబడిన విషయం తెలిసిందే.ఈ హత్య కేసును పోలీసులు 24 గంటలో చేధించి నిందితుడిని రిమాండ్కు తరలించారు. శుక్రవారం టోలీచౌకి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసిపి సయ్యద్ ఫయాజ్ వివరాలను వెల్లడించారు. ఆయుబ్ మరియు ఖాలీద్ ఇద్దరు అర్థరాత్రి వరకు మద్యం సేవించారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య సెల్ ఫోన్ విషయంలో గొడవ జరిగింది.
అయితే ఖాలీద్ ఆయుబ్ను ప్లాస్టిక్ వైరును గొంతుకు బిగించి హత్య చేసి మొబైల్ ఫోన్ తీసుకొని పరారైనట్లు ఏసిపి తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని సిసీటీవీ పుట్టేజీ ఆధారంగా నిందితుని అదుపులోకి తీసుకొని శుక్రవారం రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..