మహిళలు, చిన్నారులకు ధైర్యం కల్పించేందుకు భరోసా కేంద్రం. డీజీపీ శివధర్ రెడ్డి
హైదరాబాద్, 31 అక్టోబర్ (హి.స.) మహిళలు, చిన్నారులకు భరోసా కల్పించేందుకు శంషాబాద్ లో భరోసా కేంద్రం ఏర్పాటు చేసినట్లు డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ఆయన శంషాబాద్ డిసిపి ఆఫీసు పక్కన 33వ భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డ
డీజీపీ శివధర్ రెడ్డి


హైదరాబాద్, 31 అక్టోబర్ (హి.స.)

మహిళలు, చిన్నారులకు భరోసా కల్పించేందుకు శంషాబాద్ లో భరోసా కేంద్రం ఏర్పాటు చేసినట్లు డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ఆయన శంషాబాద్ డిసిపి ఆఫీసు పక్కన 33వ భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2016 లో మొదటి భరోసా కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. త్వరలో మరో ఆరు జిల్లాలలో ఈ కేంద్రాలను ప్రారంభించనున్నట్టు తెలియజేశారు. మహిళలు, చిన్నారులు, బాలికలకు భరోసా కేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande