సిపిఎం లీడర్ రామారావు హత్య.. దిగ్భ్రాంతికి గురైన డిప్యూటీ సీఎం
ఖమ్మం, 31 అక్టోబర్ (హి.స.) మధిర నియోజకవర్గం చింతకాని మండలం పాతర్ల పాడు గ్రామంలో శుక్రవారం ఉదయం సీనియర్ నేత సామినేని రామారావు రాజకీయ హత్యకు గురికావడంపై డిప్యూటీ సీఎం, ఆర్థిక ప్రణాళిక విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క దిగ్భ్రాంతిని వ్యక్త
భట్టి విక్రమార్క


ఖమ్మం, 31 అక్టోబర్ (హి.స.)

మధిర నియోజకవర్గం చింతకాని

మండలం పాతర్ల పాడు గ్రామంలో శుక్రవారం ఉదయం సీనియర్ నేత సామినేని రామారావు రాజకీయ హత్యకు గురికావడంపై డిప్యూటీ సీఎం, ఆర్థిక ప్రణాళిక విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దారుణమైన ఘటనకు పాల్పడిన వ్యక్తులు ఎవరైనా దోషులను వెంటాడి, వేటాడి చట్టపరంగా శిక్షిస్తామని, కలుషిత హింస రాజకీయాలకు తావు లేదు అని డిప్యూటీ సీఎం అన్నారు. శాంతిభద్రతలపై ఖమ్మం పోలీస్ అధికారులను సీరియస్గా హెచ్చరించిన డిప్యూటీ సీఎం క్లూస్ టీం, శ్రీ ఫర్ డాగ్స్, సైబర్ టీం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అన్ని మార్గాలను ఉపయోగించి దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి అని ఆదేశం చేశారు. ఇక సీనియర్ నేత సామినేని రామారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. రామారావు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని, పూర్తిస్థాయిలో ఆదుకుంటానని భరోసా ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande