భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలవాలి : కలెక్టర్ బీఎం సంతోష్
జోగులాంబ గద్వాల, 31 అక్టోబర్ (హి.స.) దేశ సమగ్రతను కాపాడేందుకు అవిశ్రాంత కృషి చేసి ఉక్కు మనిషిగా పేరుగాంచిన దేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ ను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని దేశ సమగ్రతను కాపాడుతూ, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలవా
జోగులాంబ కలెక్టర్


జోగులాంబ గద్వాల, 31 అక్టోబర్ (హి.స.)

దేశ సమగ్రతను కాపాడేందుకు అవిశ్రాంత కృషి చేసి ఉక్కు మనిషిగా పేరుగాంచిన దేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ ను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని దేశ సమగ్రతను కాపాడుతూ, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలవాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ పిలుపునిచ్చారు. వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా గద్వాల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎస్పీ శ్రీనివాసరావు తో పాటు ఇతర అతిథులు, విద్యార్థులు 2కే రన్ నిర్వహించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande