
హైదరాబాద్, 31 అక్టోబర్ (హి.స.)
రెండేళ్లలోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టుపట్టించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని పలువురు ఎంఐఎం నాయకులు నేడు బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు.
నోటికొచ్చిన హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ అన్నారు. తులం బంగారం ఇస్తాం.. యువతులకు స్కూటీలు ఇస్తాం.. వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామంటూ.. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. ఒక్క హామీని కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. ఇలాంటి సమయంలోనే ప్రజలు తెలివిగా ఆలోచించాలని పిలుపునిచ్చారు. రెండేళ్లలోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఎలా దారి తప్పించిందో గుర్తుచేసుకోవాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు