
హైదరాబాద్, 31 అక్టోబర్ (హి.స.)
డీప్ ఫేక్ పై మెగాస్టార్ చిరంజీవి
స్పందించారు. డీజీపీ, సీపీ సజ్జనార్ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారని తెలిపారు. కేసును సజ్జనార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. పోలీస్ వ్యవస్థ చాలా బలంగా ఉందన్నారు. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి డీప్ ఫేక్ వీడియోలు కలకలం రేపిన సంగతి తెలిసిందే.
ఓ వెబ్ సైట్ లో మరియు ట్విట్టర్ లో చిరంజీవి డీప్ ఫేక్ తో చేసిన చిరంజీవి అశ్లీల వీడియోలను షేర్ చేశారు. దీంతో మెగాస్టార్ పోలీసులను ఆశ్రయించగా ఎక్స్లో దయాచౌదరి అనే అకౌంట్ లో వీడియోలను షేర్ చేయగా దానిని బ్లాక్ చేశారు. అశ్లీల వీడియోలను సోషల్ మీడియా నుండి పూర్తిగా తొలగించారు. ఐపీ అడ్రస్ ద్వారా విదేశాల నుండి వీడియోలను అప్ లోడ్ చేసినట్టు గుర్తించారు. ఫేక్ వీడియోలను సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..