రైతు పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం : : ఎమ్మెల్యే కడియం
జనగామ, 31 అక్టోబర్ (హి.స.) సమాజానికి అన్నం పెట్టే రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం అని అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతులకు కచ్చితంగా న్యాయం చేస్తామని స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం వారు జనగామ జిల్లాలోని రఘునాథపల్లి మండలంలో
ఎమ్మెల్యే కడియం


జనగామ, 31 అక్టోబర్ (హి.స.) సమాజానికి అన్నం పెట్టే రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం అని అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతులకు కచ్చితంగా న్యాయం చేస్తామని స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం వారు జనగామ జిల్లాలోని రఘునాథపల్లి మండలంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పర్యవేక్షించారు. అనంతరం శ్రీహరి మాట్లాడుతూ.. రైతు లేనిదే రాజ్యం లేదని రైతన్నల సహకారంతోనే దేశ ప్రజలకు అన్నం దొరుకుతుందని వారిని ఆదుకోవాల్సిన బాధ్యత తమ పైన ఉందన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇబ్రహీంపూర్ చెరువు మత్తడి వద్ద రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో వెంటనే మరమ్మత్తు చేయాలని అధికారులను ఆదేశించారు. మత్తడి వద్ద వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande