కృష్ణ.జిల్లా మచిలీపట్నంలో చిలకలపూడి పాండురంగస్వామి.ఉత్సవాలు
కృష్ణా జిల్లా, 31 అక్టోబర్ (హి.స.) :జిల్లాలోని మచిలీపట్నంలో చిలకలపూడి పాండురంగ స్వామి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి (శుక్రవారం) నుంచి ఆరు రోజుల పాటు స్వామి వారి ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఉత్సవాల సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర స
కృష్ణ.జిల్లా మచిలీపట్నంలో చిలకలపూడి పాండురంగస్వామి.ఉత్సవాలు


కృష్ణా జిల్లా, 31 అక్టోబర్ (హి.స.)

:జిల్లాలోని మచిలీపట్నంలో చిలకలపూడి పాండురంగ స్వామి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి (శుక్రవారం) నుంచి ఆరు రోజుల పాటు స్వామి వారి ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఉత్సవాల సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర సతీసమేతంగా స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయానికి వచ్చిన మంత్రికి మేళతాళాలు, పూర్ణ కుంభంతో ఉత్సవ కమిటీ స్వాగతం పలికింది. ఆపై స్వామివారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి దంపతులతో పాటు ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, డీసీఎంఎస్ ఛైర్మన్ బండి రామకృష్ణ తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande