
హైదరాబాద్, 31 అక్టోబర్ (హి.స.)
మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీష్ రావును పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరామర్శించారు.
ఇటీవల హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ మరణించిన విషయం విధితమే. శుక్రవారం ఉదయం నియోజకవర్గ పరిధిలోని మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులతో కలిసి హైదరాబాద్ కోకాపేటలోని హరీశ్ రావు నివాసానికి వెళ్లారు. సత్యనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.హరీశ్ రావును ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..