
సిద్దిపేట: 31 అక్టోబర్ (హి.స.)
సిద్దిపేట జిల్లాలో నడిరోడ్డుపై ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొన్నాల దాబా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన నారదాసు బాలరాజుగా గుర్తించారు. బస్సు వస్తుండగా అతడు చక్రాల కింద పడి ఆత్మహత్యకు పాల్పడుతున్న దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ