“బతికుండగానే మార్చురీ కి” ఘటన పై మొదలైన ఎంక్వయిరీ.!
మహబూబాబాద్, 31 అక్టోబర్ (హి.స.) రాష్ట్రం లో సంచలనంగా మారిన ''బతికుండగానే మార్చురీ'' కి ఘటనపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డి.ఏం.ఈ) ఆదేశాలతో ములుగు జనరల్ ఆసుపత్రి సూపరెండెంట్ చంద్రశేఖర్, జనగామ జనరల్ ఆసుపత్రి సూపరెండెంట్ గోపాల్ రావు, సి
ఎంక్వయిరీ


మహబూబాబాద్, 31 అక్టోబర్ (హి.స.)

రాష్ట్రం లో సంచలనంగా మారిన 'బతికుండగానే మార్చురీ' కి ఘటనపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డి.ఏం.ఈ) ఆదేశాలతో ములుగు జనరల్ ఆసుపత్రి సూపరెండెంట్ చంద్రశేఖర్, జనగామ జనరల్ ఆసుపత్రి సూపరెండెంట్ గోపాల్ రావు, సిద్దిపేట మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ నిపుణులు శ్రీధర్ లతో కూడిన వైద్య బృందం మానుకోట ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని విచారణ ప్రారంభించారు. అసలు ఏం జరిగింది? ఎలా జరిగింది? అనే కోణం లో ఐ.సి.యు లో చికిత్స పొందుతున్న బాధిత రోగి వెల్డి రాజు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అలాగే మార్చురీ స్విపర్, పోలీస్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. సీసీ ఫుటేజ్ సైతం పరిశీలించనున్నారు. ఘటనపై విచారణ కొనసాగుతోంది అని పూర్తి వివరాలు బహిర్గతం చేయలేం అని నివేదిక ను డి.ఏం.ఈ కి సమర్పిస్తాం అని వైద్య బృందం తెలిపింది. ---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande