కలెక్టర్ ఆదేశాలతో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు..
పెద్దపల్లి, 31 అక్టోబర్ (హి.స.) అక్రమ నిర్మాణాలను అధికారులు నేల మట్టం చేశారు. శుక్రవారం తెల్లవారుజామున పెద్దపల్లి జిల్లాలోని మంథని కాటారం కు వెళ్లే ప్రధాన రహదారిని అనుకోని ఉన్న మంథని శివారులోని సర్వే నెం 314 లో ప్రభుత్వ భూమిలో అక్రమంగా బిల్డింగ
అక్రమ నిర్మాణాలు


పెద్దపల్లి, 31 అక్టోబర్ (హి.స.)

అక్రమ నిర్మాణాలను అధికారులు నేల

మట్టం చేశారు. శుక్రవారం తెల్లవారుజామున పెద్దపల్లి జిల్లాలోని మంథని కాటారం కు వెళ్లే ప్రధాన రహదారిని అనుకోని ఉన్న మంథని శివారులోని సర్వే నెం 314 లో ప్రభుత్వ భూమిలో అక్రమంగా బిల్డింగ్లు నిర్మించారని కలెక్టర్ ఆదేశాలతో అక్రమ నిర్మాణాన్ని నేలమట్టం చేశారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రెవెన్యూ, పోలీసు అధికారుల బందోబస్తు నడుమ అక్రమ నిర్మాణాల కూల్చివేతలు జరిగినవి. ప్రభుత్వ భూమిలో ఓ మాజీ ప్రజా ప్రతినిధి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టాడని బాధితుల నుండి అధికారులకు ఫిర్యాదుల వెళ్లాయి. ఇంకా సోషల్ మీడియాలో కూడా దీనిపై పలు మార్లు బాధితులు పోస్ట్ లు కూడా చేశారు. దీంతో అధికారులు విచారణ చేసి.. ఇది అక్రమమేనని నిర్దారించడం తో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కూల్చి వేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande