
అమరావతి, 31 అక్టోబర్ (హి.స.)
,:ప్రభుత్వ ఆస్పత్రుల అసోషియేషన్‌తో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఈ క్రమంలో సమ్మె విరమించాలని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద ఉన్న స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ నిర్ణయించింది. వైద్య సేవా పథకం కింద సేవలన్నింటినీ పున:ప్రారంభించాలని నిర్ణయించినట్లు అసోసియేషన్ ప్రకటించింది. రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్యసేవల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు ఫలించాయి. ఈరోజు (శుక్రవారం) సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్‌తో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమర్ యాదవ్ ( చర్చలు జరిపారు. వెంటనే రూ.250 కోట్ల బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం అంగీకారం తెలపడంతో ప్రభుత్వ ఆస్పత్రుల అసోషియేషన్ సమ్మె విరమించి
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ