ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా బిజెపి ఘన నివాళులు..
హైదరాబాద్, 31 అక్టోబర్ (హి.స.) భారత మాజీ ఉప ప్రధాని, దేశ సమైక్యతా శిల్పి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని ఫతే మైదాన్, బషీర్ బాగ్ వద్దనున్న బాబు
బిజెపి చీఫ్


హైదరాబాద్, 31 అక్టోబర్ (హి.స.)

భారత మాజీ ఉప ప్రధాని, దేశ సమైక్యతా శిల్పి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని ఫతే మైదాన్, బషీర్ బాగ్ వద్దనున్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుండి ప్రారంభమై, అసెంబ్లీ సమీపంలోని పబ్లిక్ గార్డెన్ X రోడ్ వద్ద సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు, మహారాష్ట్ర ఐటీ మరియు సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ఆశిష్ షెలార్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్, బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు, తదితర నాయకులు పాల్గొన్నారు. సర్ధార్ పటేల్ సేవలు, త్యాగాలు, దేశ సమైక్యత పట్ల ఆ మహనీయుడు చూపిన దృఢ సంకల్పాన్ని స్మరించుకుంటూ ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్ సందేశంతో ఈ రన్ ఫర్ యూనిటీ విజయవంతంగా నిర్వహించబడింది.

ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు మాట్లాడుతూ.. భారత ఏకత్వానికి ప్రతీక, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతిని పురస్కరించుకొని వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం అన్నారు.

.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande