
అమరావతి, 31 అక్టోబర్ (హి.స.)
ఇంకా మొంథా తుఫాన్ బీభత్సం నుండి బయట పడకముందే తెలుగు రాష్ట్రాలకు మరో షాక్ ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం నవంబర్ 4న బంగాళాఖాతంలో మరో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. అండమాన్ సమీప ప్రాంతాల్లో ఈ అల్పపీడనం రూపుదిద్దుకునే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ అల్పపీడన బలపడితే మరోసారి భారీ వర్షాలు, గాలివానలు తెలుగు రాష్ట్రాలను మళ్లీ వణికించే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. రెండు రోజుల క్రితం దూసుకొచ్చిన మొంథా తుఫాన్ ఏపీ, తెలంగాణల్లో భారీ నష్టం సృష్టించిన సంగతి తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV