ఏపీలో పనిచేస్తున్న 58 మంది తెలంగాణ ఉద్యోగుల బదిలీ
అమరావతి, 31 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో పనిచేస్తున్న 58 మంది తెలంగాణ ఉద్యోగులను వారి సొంత రాష్ట్రానికి పంపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ కానున్న వారిలో క్లాస్ 3, క్లాస్ 4 స్థాయి ఉద్య
Rain


అమరావతి, 31 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో పనిచేస్తున్న 58 మంది తెలంగాణ ఉద్యోగులను వారి సొంత రాష్ట్రానికి పంపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ కానున్న వారిలో క్లాస్ 3, క్లాస్ 4 స్థాయి ఉద్యోగులు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం విధించిన కొన్ని షరతులకు అంగీకరిస్తూ ఏపీ సర్కార్ ఈ బదిలీ ప్రక్రియకు ఆమోదం తెలిపింది.

రాష్ట్ర విభజన సమయంలో ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియలో భాగంగా పలువురు తెలంగాణ ప్రాంత ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. అయితే, వీరిలో 58 మంది ఉద్యోగులు తెలంగాణనే తమ ఆప్షన్‌గా ఎంచుకున్నారు. వీరిలో కొందరు సరైన అవగాహన లేకపోవడం వల్ల, మరికొందరు కారుణ్య నియామకాల కింద తెలంగాణకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ, వివిధ కారణాల వల్ల వీరు ఏపీలోనే ఉండిపోవాల్సి వచ్చింది.

తమను కూడా సొంత రాష్ట్రానికి పంపించాలని వీరంతా చాలాకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ అభ్యర్థనను పరిశీలించిన ప్రభుత్వం, తెలంగాణ సర్కార్‌తో సంప్రదింపులు జరిపింది. తెలంగాణ ప్రభుత్వం విధించిన కొన్ని నిబంధనలు, షరతులకు అంగీకారం తెలిపి, ఈ 58 మంది ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande