సొంతింటి కలను నిజం చేయడమే తన లక్ష్యం : ఎమ్మెల్యే పోచారం
నిజామాబాద్,31 అక్టోబర్ (హి.స.) పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే తమ లక్ష్యమని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. బాన్సువాడ మండలం నాగారం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా శుక్రవారం పోచా
ఎమ్మెల్యే పోచారం


నిజామాబాద్,31 అక్టోబర్ (హి.స.) పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే తమ లక్ష్యమని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. బాన్సువాడ మండలం నాగారం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా శుక్రవారం పోచారం హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదవాడి ఆత్మగౌరవ ప్రతీకలు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం అని అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఇళ్లు లేని, కూలిపోయే స్థితిలో ఇళ్లు ఉన్న పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని తెలిపారు. అందరికీ సొంత ఇంటి కలను నిజం చేయడమే నా లక్ష్యం అని.. కుల, మతాలకు, పార్టీలకు అతీతంగా పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అవుతున్నాయన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande