ఇకపై రాష్ట్రంలో భిక్షాటన నిషేధం.. జీవో జారీ చేసిన ప్రభుత్వం
అమరావతి, 31 అక్టోబర్ (హి.స.)ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో యాచకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. గుడి, బడి, వీధి ఇలా ఎక్కడ చూసిన వారే కనిపిస్తున్నారు. కొంత మంది అయితే భిక్షాటనను ఓ మాఫియా గా మార్చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Go
ఇకపై రాష్ట్రంలో భిక్షాటన నిషేధం.. జీవో జారీ చేసిన ప్రభుత్వం


అమరావతి, 31 అక్టోబర్ (హి.స.)ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో యాచకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. గుడి, బడి, వీధి ఇలా ఎక్కడ చూసిన వారే కనిపిస్తున్నారు. కొంత మంది అయితే భిక్షాటనను ఓ మాఫియా గా మార్చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Govt) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు 'భిక్షాటన నివారణ (సవరణ) చట్టం- 2025' అధికారికంగా అమల్లోకి వచ్చింది.

ఈ ('Begging Prevention Act') చట్టం అమలుతో ఇకపై ఏపీలో ఎక్కడ భిక్షాటన చేసినా.. తీవ్రమైన నేరంగా పరిగణించనున్నారు. ఈ నెల 15న చట్టానికి గవర్నర్ ఆమోదముద్ర వేయగా.. 27న ఏపీ గెజిట్‌లో చట్టం ప్రచురితమైంది. లా డిపార్ట్‌మెంట్ సెక్రటరీ గొట్టాపు ప్రతిభా దేవి సంతకంతో జీవో ఎంఎస్ నం.58 విడుదల చేశారు. ఈ చట్టాన్ని సంక్షేమ, పోలీసు శాఖ సమన్వయంతో అమలు చేయనున్నాయి. రాష్ట్రంలో పెరుగుతున్న భిక్షాటన మాఫియా, వ్యవస్థీకృత భిక్షాటనను పూర్తిగా నిర్మూలించడం, నిరుపేదలకు పునరావాసం కల్పించాలన్న లక్ష్యంతో చట్టాన్ని తీసుకొచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande