
హైదరాబాద్, 31 అక్టోబర్ (హి.స.)
మహమ్మద్ అజారుద్దీన్పై కేసులు
ఉన్నాయని, దేశ ద్రోహి అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ అజార్ ప్రమాణ స్వీకారానికి రాజ్భవన్కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ ద్రోహులు ఎవరో, దేశానికి సేవ చేసిన వారు ఎవరో కిషన్రెడ్డికి తెలియకపోవడం బాధాకరమని అన్నారు. ఓ మైనారిటీ నేతని కేబినెట్లోకి తీసుకుంటే ఎందుకు అంత అక్కసు.. అంటూ ఫైర్ అయ్యారు. నిరుపేద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా అజారుద్దీన్ ఎదిగాడని గుర్తు చేశారు. ఆయనపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడిన మాటలు సరికావని ధ్వజమెత్తారు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్గా అజారుద్దీన్ ఎన్నో విజయాలు అందించిన విషయం మరిచిపోయారా అని ప్రశ్నించారు. ఎంపీగా కూడా ప్రజలకు సేవలందించారని అన్నారు. అజారుద్దీన్ మంత్రి పదవి విషయంలో తమ పార్టీ అధిష్ఠానం మూడు నెలల ముందుగానే నిర్ణయం తీసుకుందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు