న్యూ డిల్లీ , 4 అక్టోబర్ (హి.స.)
భారత న్యాయ వ్యవస్థపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత న్యాయ వ్యవస్థ బుల్డోజర్లతో నడవడం లేదని.. చట్టబద్ధమైన పాలనతోనే నిర్వహించబడుతుందని తెలిపారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా గవాయ్ మారిషస్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా “అతిపెద్ద ప్రజాస్వామ్యంలో చట్ట పాలన అనే అంశంపై గవాయ్ ప్రసంగించారు. న్యాయమూర్తి ఒకేసారి జ్యూరీ, ఉరిశిక్షకుడిగా వ్యవహరించలేరని తెలిపారు. నిందితులను గుర్తించకముందే ఆస్తులను అక్రమంగా ధ్వంసం చేయడాన్ని తన తీర్పుతో నిరోధించినట్లు చెప్పారు. భారత న్యాయ వ్యవస్థ బుల్డోజర్ నియమం ద్వారా కాకుండా చట్ట నియమం ద్వారా నిర్వహించబడుతుందని గవాయ్ సందేశాన్ని పంపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు