అమెరికాలో కాల్పులు.. హైదరాబాద్ విద్యార్థి మృతి
హైదరాబాద్, 4 అక్టోబర్ (హి.స.) అమెరికాలో కాల్పులకు మరో తెలుగు యువకుడు బలయ్యాడు. డాలస్లో ఇవాళ ఉదయం ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో హైదరాబాద్కు చెందిన విద్యార్థి పోలె చంద్రశేఖర్ మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిల
అమెరికాలో కాల్పులు


హైదరాబాద్, 4 అక్టోబర్ (హి.స.) అమెరికాలో కాల్పులకు మరో తెలుగు

యువకుడు బలయ్యాడు. డాలస్లో ఇవాళ ఉదయం ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో హైదరాబాద్కు చెందిన విద్యార్థి పోలె చంద్రశేఖర్ మృతిచెందాడు.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలోని బీఎన్ రెడ్డి నగర్కు చెందిన చంద్రశేఖర్ 2023లో బీడీఎస్ పూర్తి చేశాడు. అనంతరం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడే ఓ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రశేఖర్ విధుల్లో ఉన్న సమయంలో ఓ దుండగుడు వచ్చి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా, కాల్పులకు పాల్పడింది ఓ నల్లజాతీయుడు అని సమాచారం.

అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మరణంపై మాజీ మంత్రి హరీశ్రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డితో కలిసి బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. ఉన్నత స్థాయిలో ఉంటాడనుకున్న కొడుకు ఇక లేడు అన్న విషయం తెలిసి తల్లిదండ్రులు పడుతున్న అవేదన చూస్తే గుండె తరుక్కు పోతున్నదని హరీశ్రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని చంద్ర శేఖర్ పార్థీవ దేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తరలించేందుకు కృషి చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande