హైదరాబాద్, 4 అక్టోబర్ (హి.స.)
కొండాపూర్లోని భిక్షపతి నగర్లో హైడ్రా ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపట్టింది. శనివారం ఉదయం నుంచే భారీ పోలీసు బందోబస్తు మధ్య 36 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. సర్వే నెంబర్ 59లో ఉన్న36 ఎకరాల స్థలం.. 12 మంది రైతుల ఆధీనంలో ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. ఇది ప్రభుత్వ ఆస్తిగా నిర్ధారించారు. ల్యాండ్ వాల్యూ మొత్తం రూ.3600 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయానికి సమీపంలోని సర్వే నంబర్ 59లో 36(Survey No. 59) ఎకరాల ప్రభుత్వ భూమిని కొంత మంది కబ్జా చేశారని హైడ్రా గుర్తించింది. దీనిపై గతంలో రైతులకు అనుకూలంగా రంగారెడ్డి జిల్లా సివిల్ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఆ తీర్పును హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేసింది. దీంతో ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ 36 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అని తేల్చి చెప్పింది. హైకోర్టు తీర్పు మేరకు ఈ రోజు ఉదయం నుంచి కొండాపూర్ లోని భిక్షపతి నగర్లో హైడ్రా ఆక్రమణలు తొలగింపునకు చర్యలు చేపట్టింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణలు తొలగించారు---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..