తెలంగాణ, మెదక్. 4 అక్టోబర్ (హి.స.)
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు
తెగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలను శనివారం మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. ఉమ్మడి రామాయంపేట, నిజాంపేట మండలాల్లో కలెక్టర్ పర్యటించారు. కాట్రియాల, పర్వతాపూర్ గ్రామాల మధ్య ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెగిపోయిన రోడ్డు మరమ్మత్తు పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిజాంపేట మండలంలోని నస్కల్, నందిగామ బ్రిడ్జి లు పూర్తిగా దెబ్బ తినడంతో వాటిని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనెల 8న సెంట్రల్ టీం సభ్యుల పర్యటన నేపథ్యంలో బ్రిడ్జిలను పర్యవేక్షించినట్లు తెలిపారు. వరద తీవ్రతకు ఎంత నష్టం వాటిల్లిందని దానిపై సెంట్రల్ టీం సభ్యులు పరిశీలన చేయనున్నట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు