హైదరాబాద్, 4 అక్టోబర్ (హి.స.)
జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాగంటి గోపీనాథ్ కుటుంబంపై కాంగ్రెస్ పార్టీకి కూడా సానుభూతి ఉందని అన్నారు. కానీ.. సెంటిమెంట్ రాజకీయంతో అభివృద్ధి జరుగదని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు వారి రాజకీయాల కోసం.. మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులను కూడా రోడ్డు మీదకు తీసుకొచ్చారని మండిపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు