యాదాద్రి నరసన్నకు భక్తుల తాకిడి..
తెలంగాణ, 4 అక్టోబర్ (హి.స.) యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామి వారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. క్యూలైన్లన్ని భక్తులతో నిండిపోయాయి. స్వామి వారి సర్వదర్శనానికి రెండు గంటల సమయం, ప్రత్యేక దర్శనాన
యాదాద్రి


తెలంగాణ, 4 అక్టోబర్ (హి.స.)

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామి వారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. క్యూలైన్లన్ని భక్తులతో నిండిపోయాయి. స్వామి వారి సర్వదర్శనానికి రెండు గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి ఒక గంట సమయం పడుతోంది.

రేపటితో దసరా సెలవులు ముగియనుండడంతో.. యాదాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అందులోనూ ఇవాళ శనివారం కావడంతో.. భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. అధికారులు, పోలీసులు తగు చర్యలు తీసుకుంటున్నారు. భక్తుల రద్దీ ఆదివారం మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande