హైదరాబాద్, 4 అక్టోబర్ (హి.స.)
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల
విచారణ ప్రారంభమైంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్ లో విచారణ కొనసాగుతోంది. ఈ విచారణకు నేడు ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల అడ్వకేట్లను పిటిషనర్స్ తరపు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. ఈ నెల 1వ తేదీన ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాశ్ గౌడ్ లను విచారించాలని నిర్ణయించారు. కానీ కాలే యాదయ్యకు విచారణకు ఎక్కువ సయమం పట్టడంతో ఆ రోజున అందరి విచారణ సాధ్యం కాలేదు. దాంతో ఇవాళ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను విచారిస్తున్నారు. ఇవాళ వీరి విచారణ పూర్తయితే మరో నలుగురు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు