హైదరాబాద్, 4 అక్టోబర్ (హి.స.)
పీఎం-సేతు పథకాన్ని (PM-SETU
Scheme) ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో శనివారం ప్రధాని మోడీ లాంఛనంగా ప్రారంభించారు. దేశ యువతకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు రూ.62,000 కోట్లకు పైగా ఖర్చు చేసే అనేక ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇది 6,500 మంది విద్యార్థులకు స్థలం కల్పించే అత్యాధునిక విద్యా కేంద్రం. ఇక్కడ 5G యూస్ కేస్ ల్యాబ్, ISROతో కలిసి రీజియనల్ అకడమిక్ సెంటర్ ఫర్ స్పేస్, ఇన్నోవేషన్ అండ్ ఇన్యుబేషన్ సెంటర్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ ఇన్క్యుబేషన్ సెంటర్ ఇప్పటికే 9 స్టార్టప్లకు మద్దతు ఇచ్చింది. ఈ క్యాంపస్... బిహార్ టెక్నాలజీ, రీసెర్కు కొత్త ఊరట ఇస్తుందని అధికారులు చెబుతున్నారు. పాట్నా నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్యాంపస్.. భవిష్యత్ ఇంజినీరింగ్ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు అందిస్తుంది. ముఖ్యంగా యువత విద్యా, నైపున్యాభివృద్ధికి ఈ పథకం తోడ్పడనుందని ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. బిహార్ లోని 19 జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బిహార్ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు శ్రమిస్తున్నామని అన్నారు. జీఎస్టీ తగ్గింపు వల్ల బిహార్ యువతకు ఈసారి డబుల్ బొనాంజ వచ్చిందని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్, ఉపాధి అవకాశాలు దక్కాలంటే నైపుణ్యాలు కావాలని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు