హైదరాబాద్, 4 అక్టోబర్ (హి.స.)
ఎల్బీనగర్ ఎస్ వో టి పోలీసులు మీర్పేట్ పోలీసులతో కలిసి పేకాట స్థావరంపై దాడి చేసి పేకాట ఆడుతున్న 6 గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.3.13 లక్షల నగదు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. ఇన్స్పెక్టర్ శంకర్ కుమార్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగ్ పేట్, అన్నపూర్ణ కాలనీలో గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు మీర్పేట్ పోలీసులతో కలిసి ఎల్బీనగర్ ఎస్ఓటి పోలీసులు పేకాట స్థావరంపై సంయుక్తంగా దాడి చేసి ఆరుగురు వ్యక్తుల్ని అరెస్టు చేశారు. వారి వద్ద నుండి రూ.3.13 లక్షల నగదును, 9 సెల్ ఫోన్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ పేకాట స్థావరాన్ని సికింద్రాబాద్కు చెందిన ముజీబ్ నిర్వహిస్తున్నట్లు అతను పరారీలో ఉన్నట్లు అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..