రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం.. తల్లి, కూతురు మృతి
తెలంగాణ, కరీంనగర్. 4 అక్టోబర్ (హి.స.) కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాద సంఘటన జరిగింది. రాజీవ్ రహదారి దేవక్కపల్లి స్టేజి వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఓ కుటుంబం సీత ఫలాల కోసం రోడ్డు పక్కన ఆగారు.
రోడ్డు ప్రమాదం


తెలంగాణ, కరీంనగర్. 4 అక్టోబర్ (హి.స.)

కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాద సంఘటన జరిగింది.

రాజీవ్ రహదారి దేవక్కపల్లి స్టేజి

వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఓ కుటుంబం సీత ఫలాల కోసం రోడ్డు పక్కన ఆగారు. ఈ క్రమంలో ట్రాక్టర్, డీసీఎం వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ వారిపై నుంచి వెళ్లడంతో సంఘటనా స్థలంలోనే తల్లి మరియు కూతురు దుర్మరణం చెందారు. తండ్రి మరియు ట్రాక్టర్ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కాగా మృతులు బొమ్మకల్లు గ్రామానికి చెందిన వారిగా స్థానికులు తెలిపారు. తోటపల్లి నుంచి బొమ్మకల్లుకు వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రక్కన ఆగడంతో అనుకోని ప్రమాదం సంభవించి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande