ఫలించిన అచ్చంపేట ఎమ్మెల్యే కృషి. శ్రీశైలం ట్రస్ట్ బోర్డులో నల్లమల ప్రాంతానికి దక్కిన ప్రాతినిధ్యం..
తెలంగాణ, నాగర్ కర్నూల్. 4 అక్టోబర్ (హి.స.) తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాల సరిహద్దు నియోజకవర్గమైన అచ్చంపేట ప్రాంతానికి శ్రీశైల ట్రస్టు బోర్డులో ఒకరికి అవకాశం కల్పించాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఇటీవల ఏపీ రాజధాని అ
శ్రీశైలం బోర్డు


తెలంగాణ, నాగర్ కర్నూల్. 4 అక్టోబర్ (హి.స.)

తెలుగు రాష్ట్రాలు విడిపోయిన

తర్వాత రెండు రాష్ట్రాల సరిహద్దు నియోజకవర్గమైన అచ్చంపేట ప్రాంతానికి శ్రీశైల ట్రస్టు బోర్డులో ఒకరికి అవకాశం కల్పించాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఇటీవల ఏపీ రాజధాని అమరావతి వద్ద సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం ట్రస్టు బోర్డులో నల్లమల ప్రాంతానికి సంబంధించి ఒకరికి అవకాశం కల్పించాలని కోరారు.

ఈ నేపథ్యంలో అందుకు సానుకూలంగా స్పందిస్తూ.. ABVPలో 14 సం.లు పూర్తి స్థాయి కార్యకర్తగా ఆ తర్వాత బీజేపీలో కీలక నేతగా కొనసాగుతున్న BJP తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కట్టా సుధాకర్ రెడ్డిని నియమించడం జరిగింది. ఈ సందర్భంగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఏపీ సీఎంతో పాటు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే బిజెపి నాగర్ కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షులు గంగిశెట్టి నాగరాజు ఇతర నాయకులు సుధాకర్ రెడ్డికి అభినందనలు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande